Akhanda 2 | టాలీవుడ్ మాస్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2: తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను మరియు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రతి అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలైన అఖండ చిత్రం అఖండ విజయం సాధించడంతో, సీక్వెల్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. బాలయ్య పౌరాణిక గెటప్, బోయపాటి మాస్ మేకింగ్, థమన్ మ్యూజిక్ ఇవన్నీ కలిసొచ్చి అఖండను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. ఇప్పుడు అదే కాంబోలో రాబోతున్న “అఖండ 2” పై ఆడియన్స్ క్రేజ్ తారాస్థాయిలో ఉంది.
ఈ మూవీని సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల జాప్యం కారణంగా సినిమాను వాయిదా వేశారు. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన రాజా సాబ్ సినిమా జనవరి నెలకు వాయిదా పడింది. దీంతో ఆ డేట్ ఖాళీ కావడంతో, అదే సమయంలో “అఖండ 2” రిలీజ్ కావచ్చనే ఊహాగానాలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం, “అఖండ 2” కూడా జనవరి సంక్రాంతి సీజన్‌కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సంక్రాంతి అంటేనే పెద్ద సినిమా ఫెస్టివల్. అలాంటప్పుడు బాలయ్య లాంటి మాస్ హీరో సినిమా విడుదలైతే, అది ఫ్యాన్స్‌కు అసలైన పండుగే.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఎస్.ఎస్. థమన్ , ఈసారి మరింత మాస్ యాంగిల్‌తో సంగీతం అందించనున్నారని టాక్.
అలాగే యాక్షన్ సీన్లను హాలీవుడ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. స్టంట్స్, విజువల్స్, మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ చేయకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మిస్తున్నారు. బోయపాటి- బాలయ్య కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహా , లెజెండ్ , అఖండ అన్నీ ఘనవిజయాలు సాధించాయి. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను “అఖండ 2” లో కూడా కొనసాగించనున్నారనే నమ్మకంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.