Akhanda 2 | బాలకృష్ణ-బోయపాటి శీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌లో క్రేజ్ మాములుగా ఉండదు. ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్బస్టర్లు అందించిన ఈ కాంబో నుంచి వస్తున్న ‘అఖండ–2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు వచ్చిన స్పందన సినిమాపై హైప్‌ను మరింత పెంచగా థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బాలయ్య పవర్ఫుల్ డైలాగులు, బోయపాటి మాస్ ట్రీట్మెంట్, ఆది పినిశెట్టి విలన్ షేడ్స్ అన్ని కలిసి ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేశాయి. ‘అఖండ’లో కనిపించిన మిస్టిక్ టోన్, రుద్ర భావం, భారీ యాక్షన్ బ్లాక్స్ ఈసారి మరింత గ్రాండ్‌గా ఉండబోతున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్కు ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో నవంబర్ 28, శుక్రవారం కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్లో జరుగనున్న ‘అఖండ–2’ ప్రీ రిలీస్ ఈవెంట్‌పై టాలీవుడ్ మొత్తం దృష్టి పడింది. ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతుండగా, ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. బాలకృష్ణతో రేవంత్ వ్యక్తిగత అనుబంధం ఉండటం ఈ వేడుకకు మరింత క్రేజ్ తెచ్చింది. మరోవైపు అల్లు అర్జున్ కూడా హాజరు కావచ్చన్న టాక్ నడించింది. అయితే ఆయన షూటింగ్ కమిట్మెంట్స్ కారణంగా ఈవెంట్‌కు రాలేకపోయినా, సినిమా విడుదల తర్వాత జరిగే సక్సెస్ సెలబ్రేషన్లో పాల్గొనే అవకాశముందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు.
ఈవెంట్ కారణంగా భారీగా అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో కూకట్పల్లి, కైతలాపూర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తామని వెల్లడించారు. ముసాపేట్ ఎంట్రన్స్ వద్ద భరత్‌నగర్–ఎర్రగడ్డ వైపు నుంచి GHMC ఆఫీసు మీదుగా వచ్చే వాహనాలను కూకట్పల్లి Y జంక్షన్‌కు మళ్లించనున్నారు. అశోకా వన్ మాల్ వద్ద IDL లేక్ వైపు వెళ్లే వాహనాలను JNTU రూట్‌కు పంపనున్నారు. మాదాపూర్–హైటెక్ సిటీ నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలను నెక్సస్ మాల్–JNTU వైపు మళ్లిస్తారు ఈవెంట్ సమయాల్లో అవసరం లేని ప్రయాణాలు మానుకుని,, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని పోలీసులు సూచించారు. భద్రతా ఏర్పాట్లు కూడా పెద్దఎత్తున అమల్లో ఉన్నాయి. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ప్రతి సారి బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్న నేపథ్యంలో ‘అఖండ–2’పై ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.