Akhanda 2 | గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాల విజయాలతో ఈ జోడీ టాలీవుడ్లో మోస్ట్ వెయిటెడ్ కాంబోగా నిలిచింది. ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘అఖండ 2’ పై అభిమానుల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట ఈ సినిమాను నిర్మిస్తుండగా, బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్, సంయుక్తా మీనన్ నటిస్తుండగా, ఆది పినిశెట్టి, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.
ముందుగా దసరా కానుకగా సెప్టెంబర్ 25న పాన్-ఇండియా లెవెల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ అదే రోజున పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం కూడా రిలీజ్ కానుండడంతో ‘అఖండ 2’ను వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం డిసెంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయంతో ‘అఖండ 2’పై డిస్ట్రిబ్యూటర్లకు, OTT సంస్థలకు భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, OTT హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. సమాచారం ప్రకారం, రూ. 80 కోట్లకు పైగా చెల్లించి నెట్‌ఫ్లిక్స్ ఈ రైట్స్‌ను కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యధికంగా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయిన సినిమా కావడం గమనార్హం. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ డీల్ హాట్ టాపిక్‌గా మారింది. ‘అఖండ’ విజయంతో బాలయ్య మాస్ ఇమేజ్ మళ్ళీ పీక్‌కి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అఖండ 2’ కోసం మళ్లీ అదే స్థాయి మాస్ మంత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిజినెస్ పరంగా సినిమా దుమ్మురేపుతుండగా, థియేటర్లలో ఎలా ప్రభంజనం సృష్టిస్తుందో అనే కుతూహలం సినీ వర్గాల్లో నెలకొంది.