Akhanda 2 | బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో, చిత్రబృందం నిరాశపరిచే సమాచారం విడుదల చేసింది. ఎంత ప్రయత్నించినా ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం కాలేదని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.నిర్మాతలు వెల్లడించిన వివరాల ప్రకారం, అనుకోని పరిణామాలు, సాంకేతిక,ఫైనాన్షియల్ కారణాలు సినిమా విడుదలను అడ్డుకున్నాయి. చివరి నిమిషం వరకు టీమ్ సమస్యలను పరిష్కరించేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, రిలీజ్‌ని ఆపడం తప్ప మరో మార్గం లేకపోయిందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ‘అఖండ 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు, సినీ ప్రేక్షకులకు హృదయపూర్వక క్షమాపణలు తెలుపుతూ టీమ్ ఒక భావోద్వేగ సందేశం ఇచ్చింది. ఈ క్లిష్ట సమయంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను అందించిన అండదండలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిత్రానికి అభిమానులు చూపుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటామని నిర్మాతలు పేర్కొన్నారు.అఖండ 2 కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని యూనిట్ స్పష్టం చేసింది. ఎప్పుడు వచ్చినా అఖండ 2 బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు తిరగరాయడం ఖాయం అని వారు ధీమా వ్యక్తం చేశారు.బాలయ్య–బోయపాటి కాంబినేషన్ నుంచి మళ్లీ ఒక మాస్ తుపాన్ రాబోతుందని అభిమానులు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం మూవీని డిసెంబర్ 12 లేదా డిసెంబర్ 25 తేదీలలో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే అఖండ 2’ అనౌన్స్ చేసినప్పటి నుండి అదే ఊపు ఫ్యాన్స్ లో, ఆడియన్స్‌లో కనిపించింది. అయితే ‘అఖండ 2’ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.అయితే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటివి ఏవీ కూడా మిగతా భాషల్లో ‘అఖండ 2’కి పబ్లిసిటీని తెచ్చిపెట్టలేకపోయాయి. కాని తాజా వివాదం మూవీకి మంచి బజ్ ఇచ్చిందని చెప్పాలి.