Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’ నుంచి మాస్ సాంగ్ విడుదలైంది. విశాఖపట్నంలో నిర్వహించిన ఈవెంట్లో ఈ పాట ఆడియో ట్రాక్ లాంచ్ చేయగా, విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో హల్చల్ మొదలైంది. ఇక ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ మూవీలో బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. “జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగిముద్ద రాగమాయ మనసు పాయ…” అంటూ సాగే ఈ మాస్ సాంగ్ బాలయ్య ఫ్యాన్స్‌ను పీక్ జోష్‌లోకి తీసుకెళ్లింది. తమన్ అందించిన సంగీతం వేరే లెవల్లో ఉందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ పాటను శ్రేయా ఘోషల్, బ్రిజేష్ శాండిల్య ఆలపించగా, కాసర్ల శ్యామ్ మాస్కు తగ్గ లిరిక్స్ అందించారు. మాస్ లిరిక్స్, పవర్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్, బ్లాస్టింగ్ బీజీఎం కలిసి గూస్బంప్స్ తెప్పిస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యుయెల్ రోల్ పోషించాడు. ఒకటి అఘోర పాత్ర కాగా, మరొకటి మాస్ క్యారెక్టర్ మురళీ కృష్ణ. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన గ్లింప్స్, ‘బ్లాస్టింగ్ రోర్’ వీడియోలు భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ ‘తాండవం’లో అఘోర పాత్రలో చేతిలో ఢమరుకం, త్రిశూలంతో బాలయ్య కనిపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు వచ్చిన మాస్ సాంగ్ కూడా బాలయ్య ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెంచింది.
‘అఖండ 2’ ప్రారంభమైనప్పటి నుంచే తమన్ బీజీఎంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డివోషనల్, మాస్ అంశాలకు తగ్గట్లుగా ఆయన అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. డిసెంబర్ 12 విడుదలైన ఈ చిత్రం అంచనాలని అంతగా అందుకోలేకపోయింది. మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తుండగా, హర్షాలి మెహతా కీలక పాత్రలో కనిపించనుంది. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అయిన విషయం తెలిసిందే.