Akhanda 2 |నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సెన్సేషనల్ సీక్వెల్ ‘అఖండ 2’ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడడంతో అభిమానులు చాలా నిరాశ చెందారు. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైపోయిన ఈ చిత్రం అకస్మాత్తుగా ఆగిపోవడం నందమూరి ఫ్యాన్స్‌ను తీవ్ర ఆగ్రహానికి కూడా గురిచేసింది. సినిమా వాయిదా వెనక కారణంగా నిర్మాతల ఫైనాన్స్ సమస్యలే ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. గతంలో ఉన్న బకాయిల కారణంగా విడుదల నిలిచిపోయిందన్న సమాచారం కూడా వెలువడింది. తాజాగా వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘అఖండ 2’కు సంబంధించిన అన్ని ఫైనాన్షియల్ ఇష్యూలు క్లియర్ అయ్యాయి.
రిలీజ్‌కు కావలసిన అన్ని చెల్లింపులు పూర్తి చేసినట్టు సమాచారం. ఇప్పుడు మిగిలింది కేవలం ఒక్క క్లియరెన్స్ లెటర్ మాత్రమే. అది వస్తే సినిమా విడుదలకు పూర్తిగా లైన్ క్లియర్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే చిత్ర విడుదల అకస్మాత్తుగా ఆగిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన బాలయ్య అభిమానులకు ఇది నిజంగా సంతోషకరమైన విషయం. కొత్త రిలీజ్ డేట్ కోసం అందరూ ఎదురు చూస్తున్న నేపధ్యంలో, ఈ అప్డేట్ మరింత ఆశ కలిగిస్తోంది. మేకర్స్ నుంచి వీలైనంత త్వరగా అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ రోజు రాత్రి ప్రిమియర్స్ వేసి రేపటి నుండి షోస్ కంటిన్యూగా వేస్తారని అంటున్నారు. టిక్కెటింగ్ యాప్ లో డిసెంబర్ 5 టిక్కెట్స్ బ్లాక్ అయి ఉండగా, ఆరు నుండి ఓపెన్ ఉన్నాయి. దీనిని బట్టి చాలా మంది రేపటి నుండి షోస్ స్టార్ట్ అవుతాయి అనే ధీమాలో ఉన్నారు. మరి కొందరు మూవీ డిసెంబర్ 15న రిలీజ్ కానుందని అంటున్నారు. చూడాలి మరి మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో. బాలయ్య తొలిసారి పాన్–ఇండియా రేంజ్లో తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో మూవీపై ఆసక్తి పెరిగింది. మొదటి భాగం ‘అఖండ’ తెలుగులో మాత్రమే విడుదలైనా, హిందీలో యూట్యూబ్ ద్వారా అందుబాటులోకి రాగానే కోట్లాది వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ నేపధ్యంలో ‘అఖండ 2’ ను హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు.