Akhanda 2 | నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని అవాంతరాల కారణంగా వాయిదా పడింది. అయినప్పటికీ సినిమాపై నెలకొన్న అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్, గతంలో వీరి కలయికలో వచ్చిన ‘అఖండ’ సూపర్ హిట్ కావడంతో, దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘అఖండ 2’పై మొదటినుంచి భారీ హైప్ ఏర్పడింది. విడుదల అనంతరం సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, తొలి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద గట్టి వసూళ్లు రాబట్టింది.
సాక్నిల్క్ నివేదికల ప్రకారం, ‘అఖండ 2: తాండవం’ తొలి రోజు రూ.22.5 కోట్ల నెట్ వసూలు చేసింది. ప్రీమియర్లతో కలిపి మొత్తం రూ.30 కోట్లకు పైగా వసూలు చేసి బాలయ్య బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది. మూడో రోజు వరకు వసూళ్లు బాగానే కొనసాగినప్పటికీ, నాలుగో రోజు కలెక్షన్లలో భారీగా తగ్గుదల కనిపించింది. నాలుగో రోజు పాన్ ఇండియాలో కేవలం రూ.5.45 కోట్ల నెట్ వసూలు చేయగా, మూడో రోజు వచ్చిన రూ.15.1 కోట్లతో పోలిస్తే దాదాపు 64.24 శాతం డ్రాప్ నమోదైంది. వీకెండ్ పూర్తవడంతో ఈ స్థాయిలో పడిపోవడం ఊహించినదేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, తదుపరి రోజు సినిమా కేవలం రూ.0.89 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇప్పటివరకు మొత్తం రూ.67.39 కోట్ల నెట్ వసూలు చేసినట్లు అంచనా.
వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే, ‘అఖండ 2’ సమీప రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటే అవకాశముందని అంచనా. అయితే, బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మాత్రం ఇంకా చాలా దూరం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ జరిగిన చిత్రంగా రికార్డులు సృష్టించిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ రూ.225 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉందని సాక్నిల్క్ అంచనా వేస్తోంది. ప్రస్తుత వసూళ్లను బట్టి ఈ లక్ష్యం సవాలుగా మారిందని అంటున్నారు. డిసెంబర్ 19న జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ విడుదల కానుంది. తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రావడంతో, అది మంచి టాక్ తెచ్చుకుంటే ‘అఖండ 2’పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే వీకెండ్ ‘అఖండ 2’ భవితవ్యాన్ని నిర్ణయించనుందని అంటున్నారు.