ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయికగా నటిస్తున్నది. జీవన్ రెడ్డి దర్శకుడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తున్నది. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ…‘యూవీ క్రియేషన్స్ సంస్థ మా చిత్రానికి ప్రెజెంటర్గా వ్యవహరించడం సంతోషంగా ఉంది. చిత్ర పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇటీవల బాలకృష్ణ విడుదల చేసిన ట్రైలర్ బాగుందని చెబుతున్నారు. ఇవన్నీ సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. ఈనెల 24న మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జగదీశ్ చీకటి, సంగీతం – సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ – అన్వర్ అలీ, ప్రభు దేవా.