Tegimpu Movie On OTT | సంక్రాంతి పోరులో తొలి విజేతగా నిలిచిన ‘తునివు’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 11న భారీ ఎత్తున రిలీజైంది. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో మొదటి వారం బాగానే లాక్కొచ్చింది. ఆపై ఫ్యామిలీ ఆడియోన్స్ విజయ్ సినిమాకు ఓటేయడంతో తునివి స్పీడ్‌కు బ్రేక్‌లు పడ్డాయి. నిజానికి తొలివారం వారిసుతో పోల్చితే తునివే పై చేయి సాధించింది. కానీ చివరికి వచ్చే సరికి వారిసు పైచేయి సాధించింది. ఏదైతేనేం బ్రేక్ ఈవెన్ అయితే పూర్తి చేసుకుని తొలి సంక్రాంతి విన్నర్‌గా అజిత్ నిలిచాడు. అయితే తమిళంలో లాక్కొచ్చినంత ఈజీగా తెలుగులో నెట్టుకురాలేకపోయాడు.
మొదటి రోజు సోలోగా రిలీజవడంతో పోస్టర్ ఖర్చులు, పబ్లిసిటీ ఖర్చులు వెనక్కి వచ్చాయి. కానీ రెండో రోజు వీరసింహుడి విళయతాండవంతో కనుచూపు మేరల్లో కూడా కనిపించలేదు. ఇక మూడో రోజు వాల్తేరు వీరయ్య రాకతో రిటర్న్ టిక్కెట్ బుక్ చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ ఓకే అనిపించినా.. ఆ తర్వాత కనీసం థియేటర్ల రెంటుకు సరిపడా కలెక్షన్లు సాధించలేక తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది.
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ ఫిబ్రవరి 8నుండి తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయి.. తెలుగులో ఫ్లాప్‌గా మిగిలింది.