Ajith’s emotional tribute to F1 legend Ayrton Senna | కోలీవుడ్ అగ్ర కథానాయకుడు, రేసర్ అజిత్ కుమార్ ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న అజిత్ తన పూర్తి ఫోకస్‌ను ప్రస్తుతం రేసింగ్‌పైనే పెట్టాడు. అయితే తాజాగా అజిత్ బ్రెజిల్‌కి చెందిన దివంగత ఫార్ములా 1 దిగ్గజం ఐర్టన్ సెన్నాకు ఘనంగా నివాళులు అర్పించాడు. ఇటలీలోని ఇమోలాలో ఉన్న సెన్నా స్మారక చిహ్నాన్ని అజిత్ సందర్శించి, తన ప్రగాఢమైన అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం సెన్నా విగ్రహం పాదాలను ముద్దుపెట్టుకుని, తన రేసింగ్ హెల్మెట్‌ను అక్కడ ఉంచారు.
బ్రెజిల్‌కు చెందిన ఐర్టన్ సెన్నా మూడుసార్లు (1988, 1990, 1991) ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. అతి పిన్న వయసులోనే వరుసగా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అరుదైన రికార్డు ఆయన పేరిట ఉంది. అయితే 1994లో ఇమోలా ట్రాక్‌లోనే జరిగిన ప్రమాదంలో సెన్నా కన్నుమూశారు. ఇక అలాంటి గొప్ప రేసర్‌కు అజిత్ ఇచ్చిన ఈ నివాళి, రేసింగ్ ప్రపంచంలో సెన్నా స్థానం ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ, అజిత్ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.
Ajith Kumar paying his respects to the Late Great 3 time Formula 1 World Champion Brazilian Ayrton Senna at the Tumberello corner in Imola circuit, where Senna lost his life during the San Marino Grand prix on 1st May 1994 pic.twitter.com/F58dTPLasw
— Ajithkumar Racing (@Akracingoffl) May 20, 2025