Vidaa Muyarchi | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar), త్రిష (Trisha) కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ Vidaa Muyarchi. ఏకే 62గా వస్తోన్న ఈ చిత్రాన్ని మగిజ్ తిరుమేని దర్శకత్వం డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే అజిత్‌కుమార్ అండ్ టీం అజర్‌బైజాన్‌కు షూట్ కోసం వెళ్లారని అప్డేట్ తెరపైకి వచ్చిందని తెలిసిందే. తాజాగా చిత్రీకరణకు సంబంధించిన మరో ఆసక్తికవార్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం అజర్బైజాన్లో 30 రోజుల పాటు షూట్ కొనసాగనుంది. అనంతరం 10 రోజుల హైదరాబాద్ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. దీపావళి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కసాండ్రా, అరవ్ కిజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు.
అజిత్ కుమార్ మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో నటిస్తున్న ఏకే 63 షూట్లో పాల్గొనబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే షురూ కానుందట. ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు జాన్ అబ్రహాం, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.