AK 64 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ మార్క్ ఆంటోనీ ఫేం అధిక్ రవిచంద్రన్‌తో సినిమాను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఏకే 64(AK64)గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. ఈ మూవీని అజిత్ కుమార్ నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. మరో ప్రొడక్షన్స్ హౌస్ ఫండింగ్ ద్వారా అజిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
తనకు, నిర్మాతలకు మధ్య రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు రావడంతో అజిత్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ మే మొదటి వారంలో షురూ కానుందట. అజిత్ కుమార్‌కు రేసింగ్ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రొఫెషనల్‌గా యాక్టింగ్‌కు ఇబ్బంది కాకుండా చూసుకుంటూనే మరోవైపు తనకిష్టమైన రేసింగ్‌పై కూడా ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేసుకున్నాడని టాక్.
తాజా టాక్ ప్రకారం అజిత్ కుమార్ ఒకేసారి ఇటు సినిమా, అటు రేసింగ్‌పై దృష్టిపెట్టబోతున్నాడు. అంటే నెలలో 15 రోజులు షూటింగ్ కోసం, మరో 15 రోజులు రేసింగ్ కోసం కేటాయించనున్నాడట. ఇదే నిజమైతే తనను ఎంతో ఇష్టపడే అభిమానులకు ఇటు రేసింగ్‌ను,అటు సినిమాలను మిస్ కాకుండా డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడన్నమాట.
#AK64 shooting likely to kickstart from May 1st week🎬🔥#Ajithkumar will be concentrating on Films & Racing in parallel, like 15 Days for shoot & 15 Days for Racing🏎️
Directed by AadhikRavichandran, AK is considering to produce the film himself, backed by the funding of another… pic.twitter.com/Xl3CUZGuxJ
— AmuthaBharathi (@CinemaWithAB) April 9, 2026
Sai Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. లగ్నపత్రిక వేడుక ఫోటోలు వైరల్!
INCA 2026 | ఉత్తమ నటుడిగా నాగ చైతన్య… రష్మికకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు