Ajith | కోలీవుడ్ మాస్ హీరోగా అజిత్ అశేష అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన అజిత్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఆయన తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నెగెటివ్ టాక్ని మూటగట్టుకుంది. అయితే అజిత్ క్రేజ్ దృష్ట్యా ఈ మూవీని చూసేందుకు తొలి రోజు చాలా మంది ఆసక్తి చూపారు. ఈ క్రమంలో అజిత్,శాలినిల కూతురు అనౌష్క కూడా తన తండ్రి సినిమా థియేటర్స్‌లో చూసేందుకు వచ్చింది. అజిత్ కుమార్ కుమార్తె అనౌష్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు.
దాంతో ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. అయితే అజిత్ మూవీ కోసం బయటకు వచ్చిన అనౌష్కని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. తల్లిదండ్రుల అందాన్ని సొంతం చేసుకొని ఎంత గ్లామరస్‌గా ఉంది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అనౌష్కకి ఇప్పుడు 17 సంవత్సరాలు.ఎరుపు రంగు టాప్, నల్ల ప్యాంటు ధరించి థియేటర్‌కి వచ్చిన అనుష్కని చూశాక అన్ని కెమెరాలు ఆమె వైపే తిరిగాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అనౌష్కకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి వస్తే స్టార్ హీరోయిన్ కావడం గ్యారెంటీ అంటున్నారు.
ఇక తల అజిత్ కుమార్- షాలిని దంపతుల ప్రేమకథ గురించి తెలిసిందే. ఈ జంట కలిసి నటించే క్రమంలో ప్రేమలో పడి పెద్దల్ని ఒప్పించి పెళ్లాడారు. షాలిని 2001లో సినిమాను వదిలేసింది. సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆమె తమిళంలో విజయ్‌తో కాదలుక్కు మరియాధై, అజిత్‌తో అమరకాలం, విజయ్‌తో కన్నుక్కుల్ నిలవు, మాధవన్‌తో సఖీ చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది.. చివరగా ఆమె ప్రశాంత్‌తో పిరియధ వరమ్ వేండుమ్ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత నటనకు రిటైర్మెంట్ ని ప్రకటించింది. హీరో అజిత్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.పెళ్లి తర్వాత నటి షాలిని సినిమా వైపు చూడలేదు. పెద్ద డైరెక్టర్లు పిలిచినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. నటి షాలిని మళ్లీ సినిమాల్లోకి వస్తోందనే టాక్ నడుస్తున్నా దీనిపై క్లారిటీ అయితే రావడం లేదు