నటుడు అజయ్ లీడ్‌రోల్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది బ్రెయిన్’. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకుడు. ఎండ్లూరి కళావతి నిర్మాత. చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథ ఇది.
ఉత్కంఠను రేకెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పారు. తన్విక, బేబీ దాన్విత, అజయ్‌ఘోష్, శరత్ లోహిత్, జయచంద్రనాయుడు, రవి కాలే, జ్యోతి, ఆర్.కె.నాయుడు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోతుగడ్డ ఉమాశంకర్, కెమెరా: యూఎస్ విజయ్, సంగీతం: ఎంఎల్ రాజా, నిర్మాణం: ఎండ్లూరి ఎంటర్టైన్మెంట్స్.