Bholaa | బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ప్రాజెక్ట్ భోళా (Bholaa). కార్తీ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఖైదీ చిత్రానికి హిందీ రీమేక్‌గా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. కొన్ని రోజుల క్రితం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన (rental fee) రూ.399 ఫీజుతో వీక్షించే అవకాశం కల్పించారు.
అయితే తాజాగా అమెజాన్ తన సబ్స్క్రైబర్లకు శుభవార్త అందించింది. భోళా చిత్రాన్ని ఎలాంటి అద్దె చెల్లించకుండా వీక్షించే అవకాశాన్ని కల్పించింది. ఇంకేముంది థియేటర్లలో సినిమా చూడని వారు అమెజాన్ ప్రైమ్‌లో ఉచితంగా చూసేయండి మరి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో టబు పోలీసాఫీసర్‌గా నటించగా.. అమలాపాల్ ఫీ మేల్ రోల్ రోల్లో నటించింది.
ఈ చిత్రాన్ని అజయ్ దేవ్గన్ ఫిలిమ్స్, టీ-సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కించాయి. అజయ్‌దేవ్‌గన్ దర్శకత్వంలో వచ్చిన నాలుగో సినిమా భోళా. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజ్రాజ్ రావు, వినీత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రాన్ని అజయ్ దేవ్గన్ ఫిలిమ్స్, టీ-సిరీస్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అజయ్‌దేవ్‌గన్ దర్శకత్వంలో వస్తున్న నాలుగో సినిమా భోళా.
భోళా టీజర్..
భోళా టీజర్ 2..