Drishyam-2 Trailer Date Announced | బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా పనిచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్లో బిజీయెస్ట్ నటులలో ఈయన ఒకడు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గోంటాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో ‘దృశ్యం-2’ ఒకటి. అభిషేక్ పతక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 18న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. తాజాగా మేకర్స్ మరో బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
‘దృశ్యం-2’ ట్రయిలర్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని మలయాళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘దృశ్యం-2’కు రీమేక్‌గా తెరకెక్కించారు. తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ రెండింటికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ రెండు వెర్షన్లు నేరుగా అమెజాన్లోనే రిలీజైయ్యాయి. ఇక హిందీ వెర్షన్‌ను మేకర్స్ థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నారు. అజయ్ దేవగన్‌కు జోడీగా శ్రీయా శరణ్ హీరోయిన్గా నటించింది. టబు, అక్షయ్ఖన్నా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
Sach ped ke beej ki tarah hota hai. Jitna bhi chahe dafnaalo, woh ek din bahar aa hi jaata hai.#Drishyam2 Trailer Out Tomorrow
Case Reopens on 18th November, 2022#Tabu #AkshayeKhanna @shriya1109 #RajatKapoor @ishidutta #MrunalJadhav @AbhishekPathakk #BhushanKumar @KumarMangat pic.twitter.com/PDunhgpdW8— Ajay Devgn (@ajaydevgn) October 16, 2022