Ajay Bhupathi | ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’… చేసింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో సూపర్ హిట్ కొట్టి అంచనాలు పెంచిన అజయ్, ఆ తర్వాత ‘మహాసముద్రం’తో నిరాశపరిచాడు. అయితే, రీసెంట్గా ‘మంగళవారం’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చి, తన ఖాతాలో మరో క్రేజీ హిట్‌ను వేసుకున్నారు. అయితే ‘మంగళవారం’ విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ, అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. దీంతో ఆయన తర్వాతి సినిమా ఏంటనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే, చాలా రోజుల తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram). తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా కూడా లవ్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తుంది. చందమామ కథలు బ్యానర్‌పై ఈ సినిమాను పి. కిరణ్ నిర్మిస్తున్నాడు. ఆశ్వనీదత్ సమర్పిస్తున్నాడు. ఈ సినిమాతో కథానాయకుడిగా ఘట్టమనేని వారసుడు జయకృష్ణ వెండితెరకి పరిచయం కాబోతుండగా.. రషా తడాని కథానాయికగా నటించబోతుంది.
My next film – #SrinivasaMangapuram ❤️🔥✊🏻
This lovestory is destined to stay in your hearts for ages ❤️#AB4 First Look blasting soon 🔥#JayaKrishnaGhattamaneni #RashaThadani@gvprakash @AshwiniDuttCh @gemini_kiran@CKPicturesoffl @VyjayanthiFilms @SwapnaCinema @AnandiArtsOffl pic.twitter.com/6Y6QphpVcc
— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 27, 2025