Aishwarya Rajesh | భావోద్వేగాల ‘ఫర్హానా’
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఫర్హానా’. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. నెల్సన్ వెంకటేషన్ దర్శకుడు. ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతున్నది.
ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఫర్హానా’. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. నెల్సన్ వెంకటేషన్ దర్శకుడు. ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ…‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం.
ఒక నాయిక ప్రధాన చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయడం సంతోషంగా ఉంది. భావోద్వేగాలతో కూడిన బరువైన పాత్రలో నటించాను. రోజూ షూటింగ్ ఒక సవాలుగా ఉండేది. లైవ్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం.
దర్శకుడు నెల్సన్ సినిమాల్లోని వైవిధ్యం ఇందులోనూ చూస్తారు’ అని చెప్పింది. దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ…‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఐశ్వర్య రాజేష్ నటన ఆకట్టుకుంటుంది. తెలుగు నేటివిటీ ఉన్న సినిమాగా మెప్పిస్తుంది’ అని చెప్పారు. నిర్మాత ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ…‘గతేడాది మేము నిర్మించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా విజయం సాధించింది. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. ‘ఫర్హానా’ ఒక వైవిధ్యమైన సినిమా. దీన్ని దర్శకుడు నిజాయితీగా తెరకెక్కించారు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

