Aishwarya Rajesh | ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకుంది కథానాయిక ఐశ్వర్యరాజేష్. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన విఫల ప్రేమ అనుభవాలను పంచుకుందీ భామ. ప్రేమించడం సులువని, అది విఫలమైనప్పుడు వచ్చే బాధ నుంచి బయటపడటం మాత్రం చాలా కష్టమని పేర్కొంది. ‘సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో ఓ వ్యక్తిని ప్రేమించాను. అనుకోకుండా మేమిద్దరం విడిపోయాం.
ఆ తర్వాత అతని నుంచి వేధింపులు ఎదుర్కొన్నా. అంతకు మందు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం ఎలాంటి రిలేషన్షిప్లో లేకుండా ప్రశాంతంగా ఉన్నా. అనుభవాలు నేర్పిన పాఠంతో ప్రేమలో పడాలంటే భయమేస్తుంది’ అని చెప్పింది.
జీవితంలో తన తల్లి ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని, ఆమెకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో చిన్న వయసులోనే పార్ట్‌టైమ్ జాబ్స్ చేశానని, ప్రస్తుతం మనసుకు నచ్చిన కథాంశాలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకుసాగుతున్నానని ఐశ్వర్య రాజేష్ తెలిపింది.