అందానికి పర్యాయపదం ఐశ్వర్యారాయ్ అనేవారు ఒకనాటి యువత. ఇప్పుడు ఆమెలో పరిపూర్ణత కనిపిస్తున్నది. ఆమె మాటల్లో భావితరాలపై బాధ్యత వినిపిస్తున్నది. రీసెంట్గా సోషల్ మీడియా వినియోగం గురించి ఆమె అద్భుతంగా మాట్లాడారు. ‘సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్లు, షేర్లు మనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపవు. నా దృష్టిలో సాంఘిక మాధ్యమానికి, మానసిక వత్తిడికి మధ్య పెద్ద తేడా లేదు.
వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ మహమ్మారికి బానిసలవుతున్నారు. ఒక తల్లిగా నాకు ఈ విషయంపై ఆందోళనగా ఉంది. దయచేసి ఆత్మగౌరవాన్ని సామాజిక మాధ్యమాల్లో వెతకొద్దు.. అది కచ్ఛితంగా అక్కడ దొరకదు. దాన్ని దాటి ప్రపంచాన్ని గమనించండి. అప్పుడు తెలుస్తుంది ఆత్మగౌరవం అంటే ఏంటో. ఆత్మవిశ్వాసంలోనే ఉంటుంది నిజమైన అందం. దాన్ని ఎక్కడో వెతక్కండి. అది మనలోనే ఉంటుంది.’ అంటూ చెప్పుకొచ్చారు ఐశ్వర్యారాయ్.