పారిస్: ఐశ్వర్యరాయ్ బ్లూ కలర్ కుర్తాలో .. పారిస్ వీధుల్లో దర్శనమిచ్చింది. రాహుల్ మిశ్రా ఆ దుస్తుల్ని డిజైన్ చేశారు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంటున్న ఐశ్వర్య.. జీన్స్ ట్రౌజర్స్, హీల్స్‌లో కనిపించింది. లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ అయిన బాలీవుడ్ స్టార్.. రెండు రోజుల క్రితం ర్యాంప్‌వాక్ చేసింది. ఈఫిల్ టవర్ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగిన ఆ వాక్‌లో ఐశ్వర్య వైట్ డ్రెస్సులో అట్రాక్ట్ చేసింది. అయితే తన భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో పారిస్ వీధుల్లోకి వచ్చిన ఐశ్వర్య.. బ్లూ కుర్తాలో చాలా అందంగా కనిపించింది. దేశీ గర్ల్ తరహాలో ఫోటోలకు ఆమె ఫోజులిచ్చింది.