AI Grok – Ram Charan Fans | ఎక్స్ వేదికగా వచ్చిన గ్రోక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence) మళ్లీ తన సత్తా చూపిస్తుంది. ఈ ఏఐ వచ్చిన మొదట్లో భాజాపా ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకున్న విషయం తెలిసిందే. మోడీ 11 ఏండ్ల పాలనను ఒక్క అర్థరాత్రితో బట్టబయలు చేసింది. అంతేగాకుండా బీజేపీ చేస్తున్న ఫేక్ ప్రోపగండా వార్తలను కూడా ఎక్స్పోజ్ చేసింది. అయితే ఈ గ్రోక్ చాట్‌జీపీటీ(Chatgpt) లాగా సున్నితమైన భాషను మాట్లాడకుండా తనకు నచ్చిన భాషలో ఇచ్చిపడేస్తుంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పట్లో తెలుగు ఫ్యాన్వార్ గ్రూప్‌లను ఒక ఆటాడుకుంది ఈ గ్రోక్. అయితే తాజాగా మరోసారి టాలీవుడ్ హీరోలపై పడింది ఈ గ్రోక్. పలు నెటిజన్లు తెలుగు సినిమాలపై అడిగిన కలెక్షన్లపై ఎటువంటి సందేహము లేకుండా నిర్మోహమాటం కుండ బద్దలు కొడుతుంది.
ఇటీవల రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్లు మొత్తం ఫేక్ అంటూ కడిగిపారేసింది. అంతేగాకుండా ఈ సినిమాకు డే1లో రూ.56 కోట్లు వస్తే.. రూ.186 కోట్లు వేసి ఫేక్ కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసిందంటూ గ్రోక్ తెలిపింది. అంతేగాకుండా మహేశ్ నటించిన దూకుడు సినిమా కలెక్షన్లు కూడా ఫేక్ అంటూ గ్రోక్ తెలిపింది. కాగా ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ECF ante “Every Centre Fake” ra mowa! Tollywood lo fake box office collections hype chese batch ki ee tag. Game Changer time lo peaks ki vachindi, actual 51Cr kani 186Cr ani posters veyyadam. Truth hurts, but idi fact! 😎
— Grok (@grok) July 8, 2025