Agent Movie censor | వచ్చే వారం విడుదల కాబోతున్న ఏజెంట్ సినిమాపై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న అఖిల్ తొలిసారి యాక్షన్ సినిమా చేయడం.. అందులోనూ సిక్స్ ప్యాక్ బాడీతో కనబడనుండటంతో ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా సురేందర్ రెడ్డి వంటి స్టైలిష్ డైరెక్టర్ ఈ సినిమాకు తెరకెక్కించడంతో సినీ ప్రేమికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దానికి తోడు ఇప్పటివరకు రిలీజైన టీజర్, ట్రైలర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28న తెలుగుతో పాటు మలయాళంలోనూ ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఇక రన్‌టైమ్ 2గంటల 36 నిమిషాలుగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు అఖిల్ సినిమాల్లో అత్యధిక రన్టైమ్తో రిలీజవుతున్న సినిమా ఇదే కావడం విశేషం. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. సాక్షీ వైద్య హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకు హిప్ హాస్ తమిళ స్వరాలు సమకూర్చాడు. అయితే ఏ ఒక్క పాట కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఏకే ఎంటర్టైనమెంట్స్తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించాడు.