Agent First Single | అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించిన హీరో అఖిల్ సినిమాలోని తొలి గీతం ‘మళ్లీ మళీ నువ్వే ఎదురొస్తే’ అనే పాటను ఆవిష్కరించారు. హిప్ హాప్ తమిళ సంగీతాన్నందించిన ఈ పాట హుషారెత్తించే బీట్తో సంగీతప్రియుల్ని మెప్పిస్తున్నది.
పాటలో వినిపించిన ఇంగ్లీష్ర్యాప్ జోష్‌ను పెంచేలా ఉంది. ఈ పాటలో అఖిల్ ైస్టెలిష్‌గా కనిపించారు. అందమైన లొకేషన్లలో ఈ గీతాన్ని చిత్రీకరించారు. ‘ఈ చిత్రంలో అఖిల్ గూఢచారి పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ మునుపెన్నడూ చూడని రీతిలో వైవిధ్యంగా ఉంటుంది. మమ్ముట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత విలువలతో తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. సాక్షివైద్య, మమ్ముట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, కథ: వక్కంతం వంశీ, సంగీతం: హిప్హాప్ తమిళ, నిర్మాణ సంస్థలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా, నిర్మాత: రామబ్రహ్మం సుంకర,దర్శకత్వం: సురేందర్ రెడ్డి.