Samantha | చేతినిండా పనుంది.. చెప్పలేనంత క్రేజ్ ఉంది.. ఈ కష్టం దేనికి సమంతా?
Samantha | గడ్డగట్టే చలిలో సమంత ట్రైనింగ్.. అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఇంత వర్కవుట్స్ అవసరమా సమంతా.. అంటున్న అభిమానులు...
Samantha | సమంతను చూసి అభిమానులు అడుగుతున్నదిదే. చేతినిండా అవకాశాలున్నాయి.. చెప్పలేనంత క్రేజ్ ఉంది.. ఇలాంటి సమయంలోనూ ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చింది..? అసలే ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగోలేదు కదా అని అడుగుతున్నారు ఫ్యాన్స్ ఆమెను. ఎందుకంటే ఈ మధ్యే మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత.. అప్పుడే ట్రైనింగ్ మొదలు పెట్టింది. ఎంతలా అంటే పొద్దున్నే ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డు మీద చెమటలు పట్టేలా కష్టపడుతుంది సమంత. ప్రస్తుతం ఈమె హైదరాబాద్ కంటే ముంబైలోనే ఎక్కువగా ఉంటుంది. అక్కడే వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. రాజ్ డికే తెరకెక్కిస్తున్న ఈ సీరీస్‌పై చాలా ఆశలు పెట్టుకుంది సామ్.
హాలీవుడ్లో సూపర్ హిట్టైన సిటాడెల్కు ఇండియన్ వర్షన్ ఇది. ఇందులో హీరోయిన్ కూడా చాలా యాక్షన్ సీక్వెన్సులు చేయాల్సి ఉంది. అందుకే దీనికోసం తనను తాను మార్చుకుంటుంది.. మలుచుకుంటుంది సమంత. ఫ్యామిలీమ్యాన్ 2లోనే అదిరిపోయే స్టంట్స్ చేసిన సామ్.. ఇప్పుడు మరింత రెచ్చిపోతుంది. ఈ మధ్యే మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత.. అప్పుడే రెస్ట్ లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టీస్ సెషన్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. జాగ్రత్త సమంత అంటూ సలహాలు ఇస్తున్నారు. పొద్దున్నే ఈ యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ హలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యూనిక్ బెన్ ఆధ్వర్యంలో చేస్తుంది సమంత. ఈ శిక్షణ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన తర్వాత నెటిజన్లు సమంతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫోకస్ అంటే ఇలా ఉండాలంటూ మెచ్చుకుంటున్నారు. ఓ వైపు ఇమ్యూనిటీ డిజార్డర్‌తో బాధ పెడుతున్నా కెరీర్ కోసం ఇంతగా కష్టపడుతున్నావ్ కదా అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు.
సిటాడెల్ వెబ్ సిరీస్‌తో పాటు తెలుగులో ఖుషీ సినిమాకు డేట్స్ ఇచ్చింది సమంత. ఆర్నెల్లుగా సమంత కోసమే విజయ్ దేవరకొండ అండ్ టీమ్ ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 1వ తేదీ నుంచి సమంత రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటుందని తెలుస్తోంది. ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. మొత్తానికి వరసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. తన క్రేజ్ ఇంకా పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈమె కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందో లేదో చూడాలి.
Read More :
Anushka Shetty | అనుష్క శెట్టి షాకింగ్ లుక్.. బరువు తగ్గకపోవడానికి కారణమేంటి..?
Bhola Shankar | భోళా శంకర్‌లో పవన్ కళ్యాణ్ సీన్.. చిరంజీవి ప్లాన్ మామూలుగా లేదుగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

