Alia Bhatt | ఆలియా ఇంటిపై కెమెరాతో నిఘా.. వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించరా..? అంటూ నటి ఫైర్
Alia Bhatt | స్టార్ నటుల (Cinema Stars) గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. వారి లైఫ్‌స్టైల్ (Lifestyle), ఫుడ్ (Food), ఇంటి సంగతులు, వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి అభిమానులు, నెటిజన్లు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. స్టార్ నటి ఆలియా భట్ (Alia Bhatt) విషయంలో కూడా ఇద్దరు వ్యక్తులు అలాగే ప్రవర్తించారు.
Alia Bhatt | స్టార్ నటుల (Cinema Stars) గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. వారి లైఫ్‌స్టైల్ (Lifestyle), ఫుడ్ (Food), ఇంటి సంగతులు, వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి అభిమానులు, నెటిజన్లు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. స్టార్ నటి ఆలియా భట్ (Alia Bhatt) విషయంలో కూడా ఇద్దరు వ్యక్తులు అలాగే ప్రవర్తించారు. ఆమె గురించి తెలుసుకునేందుకు ఏకంగా నటి ఇంటిపైనే కెమెరాతో నిఘా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆలియా (Alia Bhatt) తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది.
‘మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా? నేను ప్రశాంతంగా నా ఇంటి వద్ద కుటుంబంతో గడుపుతున్నాను. నేను మధ్యాహ్నం సమయంలో ఇంట్లో కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో నన్ను గమనిస్తున్నట్లు అనిపించింది. వెంటనే బయట వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎవరో ఇద్దరు వ్యక్తులు మా పక్క ఇంటి డాబాపై నుంచి నన్ను కెమెరాతో వీడియో తీస్తున్నారు. ఇది సరైనదేనా..? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించరా? ఎలాంటి వారి మధ్య అయినా దాటకూడని గీత ఉంటుంది. మీరు ఈరోజు ఆ గీత దాటారు. మీరు మీ హద్దులు దాటి ప్రవర్తించారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ పోస్టును ముంబయి పోలీసులను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఆలియాకు మద్దతుగా నిలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటనపై జాన్వీ కపూర్ (Janhvi Kapoor) స్పందిస్తూ.. ‘ఇది చాలా అభ్యంతరకరమైన చర్య. నాకు ఇలాంటి పరిస్థితి చాలా సార్లు ఎదురైంది. నాకు తెలియకుండానే నన్ను ఫొటోలు (Photos) తీశారు’ అంటూ గత అనుభవాలను గుర్తు చేసుకుంది. మరోవైపు ఈ ఘటనపై అనుష్క శర్మ (Anushka Sharma) కూడా స్పందించింది. ‘ఇది పూర్తిగా సిగ్గుచేటు. ఇలా చేయడం ఇది మొదటి సారి కాదు. మా కుమార్తె వామిక (Vamika) విషయంలో కూడా ఇలానే జరిగింది. ఫొటోలు తీయొద్దని ఎంతగా అభ్యర్థించినా.. వారు చివరకు ఫొటోలు తీసి పోస్టు చేశారు’ అంటూ రాసుకొచ్చారు.
వీళ్లే కాదు.. అర్జున్ కపూర్, కరణ్ జోహార్, షాహీన్ భట్ తదితర బాలీవుడ్ సెలబ్రిటీలు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మేము సెలబ్రిటీలే కావొచ్చు. కానీ, మాకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలా ఇంట్లోకి తొంగి చూడటం ఎంతవరకు సబబు..? దేనికైనా లిమిట్ ఉంటుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



Read Also…
Anushka Shetty | అనుష్క శెట్టి షాకింగ్ లుక్.. బరువు తగ్గకపోవడానికి కారణమేంటి..?
Nysa Devgan | హిందీలో మాట్లాడుతూ తడబడ్డ అజయ్ దేవ్గన్ కూతురు నైసా.. వీడియో
Nitish Kumar | ఇదేమైనా ఇంగ్లాండా..? ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు..?
Rahul Gandhi | పెండ్లిపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పిల్లలు కావాలని ఉందంటూ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

