Anushka Shetty | అనుష్క శెట్టి షాకింగ్ లుక్.. బరువు తగ్గకపోవడానికి కారణమేంటి..?
Anushka Shetty | కొందరు హీరోయిన్ల కెరీర్‌ను కొన్ని సినిమాలు డిసైడ్ చేస్తుంటాయి. అలా అనుష్క కెరీర్‌ను దారుణంగా డిసైడ్ చేసిన సినిమా సైజ్ జీరో. ఏ ముహూర్తంలో ఆ సినిమాకు సైన్ చేసిందో తెలియదు కానీ అప్పట్నుంచి ఇప్పటి వరకు మునపటి లుక్‌లోకి మాత్రం రాలేకపోతుంది ఈ బ్యూటీ.
Anushka Shetty | కొందరు హీరోయిన్ల కెరీర్‌ను కొన్ని సినిమాలు డిసైడ్ చేస్తుంటాయి. అలా అనుష్క కెరీర్‌ను దారుణంగా డిసైడ్ చేసిన సినిమా సైజ్ జీరో. ఏ ముహూర్తంలో ఆ సినిమాకు సైన్ చేసిందో తెలియదు కానీ అప్పట్నుంచి ఇప్పటి వరకు మునపటి లుక్‌లోకి మాత్రం రాలేకపోతుంది ఈ బ్యూటీ. ఒకప్పుడు సన్నగా మెరుపుతీగలా కనిపించిన అనుష్క.. ఆ తర్వాత కాస్త బరువు పెరిగింది కానీ ఎప్పుడూ చూడ్డానికి ఎబ్బెట్టుగా మాత్రం లేదు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా బరువు పెరిగిపోయి.. గుర్తు కూడా పట్టనంతగా మారిపోయింది అనుష్క. అసలు ఈ బ్యూటీ బరువు పెరగడానికి కారణమేంటి..? యోగా టీచర్ అయ్యుండి కూడా వెయిట్ ఎందుకు తగ్గలేకపోతున్నారు అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు.
కెరీర్ మొదట్లో చాలా సన్నగా కనిపించింది అనుష్క. సూపర్, మహానంది, విక్రమార్కుడు లాంటి సినిమాల్లో అనుష్కను చూసి అంతా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కాస్త బరువు పెరిగి బొద్దుగా ముద్దుగా మారిపోయింది. అనుష్క నటనకే కాదు.. గ్లామర్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎప్పుడైతే 2015లో సైజ్ జీరో సినిమా చేసిందో అప్పట్నుంచే అనుష్క వెయిట్ కంట్రోల్ తప్పింది. వెయిట్ పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గట్లేదు ఈ బ్యూటీ. మధ్యలో బాహుబలి పార్ట్ 1లో సన్నగా కనిపించింది జేజమ్మ. దాంతో హమ్మయ్యా.. మళ్లీ మామూలు లుక్‌లోకి వచ్చేసిందిగా అంటూ పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. బాహుబలి పార్ట్ 2తో పాటు భాగమతిలో వెయిట్ పెరిగింది. ఈ రెండు సినిమాల్లో అనుష్కను సన్నగా చూపించడానికి స్పెషల్ గ్రాఫిక్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా వెయిట్ పెరిగిపోయింది. తాజాగా ఈమె లుక్ మరింత వైరల్ అవుతుంది.
పూర్తిగా బరువు పెరిగిపోయిన అనుష్కను చూసి అయ్యో పాపం అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇలా ఆమెను చూస్తామని వాళ్లు ఎప్పుడూ ఊహించి ఉండరు.
కొన్ని రోజులుగా బయటికి రాని జేజమ్మ.. తాజాగా శివరాత్రి సందర్భంగా కుటుంబంతో పాటు కర్ణాటకలోని ఓ శివాలయానికి వచ్చింది. అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ అక్కడున్నది అనుష్క అని గుర్తు పట్టడానికి కూడా కాసేపు అయ్యేంతగా మారిపోయింది జేజమ్మ. అమ్మో ఏంటిలా అయిపోయింది అంటూ ఆమె వీరాభిమానులు షాక్ అవుతున్నారు. ఈమెను ఇలా చూశాక.. ఒకప్పటి లుక్‌లోకి రావడం కష్టమే అని డిసైడ్ అయిపోతున్నారు కూడా. అయితే ఈమె ఇంతలా వెయిట్ పెరగడానికి కారణం థైరాయిడ్ అనే ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం అనుష్కనే తేల్చాలి. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి హీరోగా మహేశ్ బాబు తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తుంది అనుష్క. ఏదేమైనా స్వీటీ మళ్లీ మామూలు లుక్‌లోకి వచ్చేస్తే అదే చాలు అంటున్నారు ఫ్యాన్స్.
Read More :
Bhola Shankar | భోళా శంకర్‌లో పవన్ కళ్యాణ్ సీన్.. చిరంజీవి ప్లాన్ మామూలుగా లేదుగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

