Pawan Kalyan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మామాఅల్లుళ్ల మల్టీస్టారర్ మొదలైంది!
Pawan Kalyan | మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మొదలైంది. వినోదయ సిత్తం అనే చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
Pawan Kalyan | మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మొదలైంది. వినోదయ సిత్తం అనే చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజూ కలిసి నటిస్తున్న ఈ సినిమా వినోదయ సిత్తం అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వస్తుంది. ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తమిళంలో నిర్మించాడు. ఇప్పుడు తెలుగు రీమేక్ వర్షన్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీస్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందిస్తున్నట్లు టాక్. కాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మామాఅల్లుళ్లు ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయారు.
Most ambitious & Powerful Combination #PSPK & #SDT project takes off today🤩
Keep your Bars High 📶
Bombarding updates on the way💥#PKSDT@PawanKalyan @IamSaiDharamTej@thondankani @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ pic.twitter.com/1I12VjiNLN
— BA Raju’s Team (@baraju_SuperHit) February 22, 2023
ఇదిలా ఉంటే ఈ సినిమాను శరవేగంగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన కమిట్ అయిన హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ఇది సెట్స్‌పై ఉండగానే సుజీత్ దర్శకత్వంలో ఓజీ.. ది ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్గా ప్రారంభమైంది. వీటితో పాటు హరీశ్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా సెట్స్‌పైనే ఉంది. ఇది థేరీ సినిమాకు రీమేక్‌గా వస్తుంది. ఇలా వరుస సినిమాలు ఉండటంతో వినోదయ సిత్తం సినిమాకు కేవలం 20 రోజులు మాత్రమే పవన్ కళ్యాణ్ కేటాయించినట్లు టాక్. దీంతో మార్చి నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read More :
Bhola Shankar | భోళా శంకర్‌లో పవన్ కళ్యాణ్ సీన్.. చిరంజీవి ప్లాన్ మామూలుగా లేదుగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

