Jana Nayagan | కోలీవుడ్‌లో కలకలం.. ‘జైలర్ 2’ సీన్స్ లీక్!
Jailer 2 | కోలీవుడ్‌లో వరుస లీకేజీల కలకలం చిత్ర పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Jana Nayagan | కోలీవుడ్‌లో వరుస లీకేజీల కలకలం చిత్ర పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని రోజుల క్రితమే ‘జన నాయగన్’ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు ఆన్లైన్లో ప్రత్యక్షం కాగా, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ షూటింగ్ ఫుటేజీ కూడా బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలోని ఒక కీలక సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ పరిణామంతో షాక్‌కు గురైన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వెంటనే రంగంలోకి దిగింది. తమ యాంటీ పైరసీ టీమ్ నిరంతరం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పర్యవేక్షిస్తోందని, లీకైన కంటెంట్‌ను షేర్ చేసినా లేదా ప్రమోట్ చేసినా అటువంటి అకౌంట్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాటిని శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్‌ను 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేసి, అదే ఏడాది జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, యోగి బాబుతో పాటు మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజ తారలు నటిస్తున్న ఈ సినిమా స్థాయిని దృష్టిలో ఉంచుకుని, అభిమానులు ఎవరూ ఇటువంటి లీకేజీలను ప్రోత్సహించవద్దని, కేవలం అధికారిక అప్డేట్స్ను మాత్రమే ఫాలో అవ్వాలని చిత్ర యూనిట్ విజ్ఞప్తి చేస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల దృశ్యాలు ఇలా లీక్ అవుతుండటం ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

