Goodachari-2 Latest Update | అడివిశేష్‌కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘మేజర్’ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించి, అడివిశేష్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక ఇదే జోష్‌తో ఇటీవలే రిలీజైన ‘హిట్-2’ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. కేడీగా అడివిశేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ రెండు సినిమాలిచ్చిన సక్సెస్‌తో తన తదుపరి సినిమా ‘గూఢాచారి-2’ అప్డేట్ను ప్రకటించాడు. 2018లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘గూఢాచారి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది.
కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా ప్రీ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ కీలక అప్డేట్ను ప్రకటించింది. ఈ సినిమా ప్రీ విజన్‌కు సంబంధించిన వీడియోను జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ముంబై, ఢిల్లీ నగరాల్లో భారీ ఈవెంట్ నిర్వహించి ఈ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు మేజర్ మూవీ ఎడిటర్ వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మొదటి పార్టును శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్టైనమెంట్స్, పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
#G2 it is!
Just a little taste for the New Year ❤️
An Epic Action Film visualized by our Brilliant Director @vinaykumar7121
You will know what I mean when you see our “Pre Vision” Video. We will Launch MASSIVE on Jan 9 in Mumbai & Delhi. #HappyNewYear guys 🔥#Goodachari2 pic.twitter.com/WkZ46elqJ2
— Adivi Sesh (@AdiviSesh) December 29, 2022