Adivi Sesh | టాలీవుడ్లో ఉన్న యంగ్ డైనమిక్ హీరోల్లో అడివిశేష్ (AdiviSesh) ఒకడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి క్షణం, గూడఛారి, మేజర్, హిట్ 2 వంటి సినిమాలతో తనకంటూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రేజీ హీరో నుంచి ప్రస్తుతం డెకాయిట్‌తో పాటు గూఢచారి 2 సినిమాలు వస్తున్నాయి.
అయితే అడివిశేష్‌కు సంబంధించిన అసలు పేరు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అడివి శేష్ అసలు పేరు సన్నీ చంద్ర. శేష్ ఇండియాలో పుట్టిన అమెరికాలో పెరిగాడు. అయితే అమెరికాలో ఉన్నప్పుడు అతడి పేరు సన్నీ చంద్ర. అదే సమయంలో పోర్న్ స్టార్ సన్నీ లియోని అక్కడ బాగా ఫేమస్. అలాగే సన్నీ పేరు మీదా సన్నీ డెలైట్ అంటూ ఐస్ క్రీమ్ కూడా ఉండేది అంట.. దీంతో అందరూ శేష్‌ను సన్నీ, సన్నీ అంటూ పిలిచి ఏడిపించేవారని వారి టార్చర్ భరించలేక.. శేష్‌గా పేరు మార్చుకున్నట్లు అడివి శేష్ తెలిపాడు.
అమెరికాలో నేను చదువుకునేటప్పుడు నను సన్నీ లియోన్.. సన్నీ లియోన్ అని ఏడిపించేవారు. ఆ టార్చర్ తట్టుకోలేక ఒకసారి నాన్న దగ్గరకు వెళ్లి నేను పేరు మార్చుకుంటాను.. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పాను. అయితే శేష్ అని పెట్టుకో అన్నారు. తనకు నచ్చిన క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరుమీద సన్నీ అని పెట్టానని, పంతులుగారు.. శ అనే అక్షరంతో పేరు ఉండాలని చెప్పారు. అందుకే శేష్ అని పెట్టుకో అని అన్నారు. అప్పటినుంచి నా పేరు అడివి శేష్ గా మారిందని శేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు.