Adivi Sesh | టాలీవుడ్లో యంగ్ హీరోల మధ్య పోటీ, పోలికలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటాయి. తాజాగా అడివి శేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీశాయి. ఆయన చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మరో యంగ్ హీరో గురించి ఊహాగానాలకు కారణమయ్యాయి. ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న అడివి శేష్, ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ యంగ్ హీరో గురించి పరోక్షంగా ప్రస్తావించారు.ఓ యాక్టర్ పేరు చెప్పను. నా ప్రొడ్యూసర్ బర్త్‌డే సందర్భంగా కలిశా. ‘నువ్వు నా కంటే పెద్ద సినిమా చేశావు’ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అని తెలిపారు.అయితే ఆ మాటలు తనకు ఒక రకమైన పోలికల మధ్య పోటీలా అనిపించాయని శేష్ వెల్లడించారు.
ఇక హీరోల మధ్య పోలికలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాప్‌లో ముందు పెద్ద హీరోలు ఉన్నారు. వారిని దాటాలని అనుకుంటే రజనీకాంత్, చిరంజీవి లాంటి లెజెండ్స్ ఉన్నారు. వారిని మించాలంటే షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఇంకా ఆయనకన్నా టాప్ కావాలంటే టామ్ క్రూజ్ ఉన్నారు. పోలికలు ఎక్కడికి తీసుకెళ్తాయి? అని ప్రశ్నించారు. శేష్ వ్యాఖ్యల తర్వాత నెటిజన్లు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో అని అన్వేషిస్తున్నారు. పలువురు యంగ్ హీరోల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఈ క్రమంలో సంబంధం లేని ఒక హీరో పేరు ఎక్కువగా ప్రస్తావించబడటంతో, ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా తన పేరును లాగడంపై ఆ హీరో అసహనం వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు ఆ హీరోను ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ కోసం అడివి శేష్‌ను సంప్రదించాలనే ఆలోచన వచ్చినా, “జరిగిపోయిన విషయంపై మాట్లాడి ప్రయోజనం ఏముంది” అన్న భావనతో వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఒకవేళ శేష్ నుంచి కాల్ వచ్చినా స్పందించకూడదని కూడా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, అడివి శేష్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. విభిన్న కథలను ఎంచుకుంటూ, హీరోగానే కాకుండా రచయితగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన శేష్, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.