Adivi Sesh | థ్రిల్లర్ సినిమాలకు పెట్టిన పేరు అడివి శేష్. ఈ కుర్ర హీరో నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టే అనే ముద్ర పడిపోయింది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఒక డెఫినేషన్‌లా మారిపోయాడు. అలాంటి సినిమాలు చేయాలంటే దర్శక, నిర్మాతలు సైతం ముందుగా అప్రోచ్ అయ్యేది అడివిశేష్నే. నిజానికి హీరోగా ఆయన నిలబడడానికి ముఖ్య కారణం కూడా థ్రిల్లర్ జానర్ సినిమాలు చేయడం వల్లనే. మాములుగా ఈ జానర్లో సినిమాలు చేయాలంటే హీరోలు భయపడుతుంటారు. ఎందుకంటే కథనంలో కాస్త పట్టు తప్పినా సినిమా రిజల్ట్ ఊహించని విధంగా డిజాస్టర్ అవుతుంది. అయితే అడివి శేష్ తానే స్వయంగా టైట్ స్క్రీన్‌ప్లేను రాసుకోవడంతో సినిమాలు ఆడుతున్నాయి.
ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే అడివి శేష్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఓ లవ్‌స్టోరీ సినిమా చేయబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తయినట్లు ఇన్‌స్టాలో వెల్లడించాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను నవంబర్/డిసెంబర్ నెలలో ప్రకటించబోతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా గూడాఛారి-2, ఈ సినిమా రెండు ఒకే సారి పట్టాలెక్కబోతున్నట్లు వెల్లడించాడు. ఇక చాలా కాలం తర్వాత రోమ్ కామ్ జానర్ సినిమా చేస్తుండంటంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఆరేళ్ల కిందట వచ్చిన అమి తుమి తర్వాత అడివి శేష్ ఇప్పటివరకు లవ్ స్టోరీ సినిమా చేయలేదు.
ఇక అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్నాడు. తన థ్రిల్లర్ జానర్లో కంఫర్ట్‌గా సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. గతేడాది ద్వితియార్థంలో మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టిన అడివిశేష్.. అదే ఏడాది చివర్లో హిట్టు-2తో మరో బ్లాక్‌బస్టర్ సాధించాడు. ప్రస్తుతం గూడచారి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
Adivi