అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న క్రైమ్ డ్రామా ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. అనుకోని కారణాల వల్ల విడిపోయిన ప్రేమికులిద్దరూ 13 ఏండ్ల తర్వాత కలుసుకుంటారు.
అనంతర ప్రయాణంలో వారి జీవితం ఎలా సాగింది? పదమూడేండ్ల ఎడబాటులో వారు తెలుసుకున్న నిజాలేమిటి? అన్నదే ఈ సినిమా కథాంశమని మేకర్స్ తెలిపారు. హార్ట్‌టచింగ్ లవ్‌స్టోరీ, ఇంటెన్స్ యాక్షన్‌తో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.