Nandamuri Balakrishna | నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ చిత్రాలలో ఆదిత్య 369 (Aditya 369) ఒకటి. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించగా.. 1991 ఆగస్టు 18న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా పలు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం భారతీయ సినిమాలో మొట్టమొదటి టైమ్ ట్రావెల్ చిత్రంగా పరిగణించబడుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ విజయనగర సామ్రాజ్య రాజు శ్రీ కృష్ణదేవరాయలుగా నటించి అలరించారు. అయితే ఈ సినిమా వచ్చిన 34 ఏండ్ల తర్వాత మూవీని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహిని హీరోయిన్గా నటించగా, అమ్రిష్ పూరి, టినూ ఆనంద్, సుత్తివేలు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్. అనిత కృష్ణ నిర్మించారు, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కింది.
Bringing the FIRST SCI-FI of INDIAN CINEMA, #Aditya369 back to the Big Screens in 4K ☀️
This Summer, let’s travel back in time to witness #NBK‘s Timeless Classic in theatres again✨️
Natasimha #NandamuriBalakrishna #SingeetamSrinivasaRao #SPBalasubrahmanyam @ilaiyaraaja… pic.twitter.com/jxfW229m2O
— Sridevi Movies (@SrideviMovieOff) February 26, 2025