Aditi rao hydari | ఇటీవలి కాలంలో చాలా మంది ముద్దుగుమ్మలు పెళ్లి పీటలెక్కారు. కొందరు లవ్ మ్యారేజ్ చేసుకోగా, మరి కొందరు పెద్దలు చూసిన వ్యక్తిని మనువాడారు. అయితే ఇటీవల నటుడు సిద్ధార్థ్‌ని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది అదితి రావు హైదరి. మహా సముద్రం సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితి రావు హైదరి తో షూటింగ్ సమయంలో సిద్దార్థ్ కి పరిచయం కాగా, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం వైభవంగా జరిగింది. వనపర్తి పెళ్లికి వేదిక అయింది. సిద్దు, అదితి లు పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో తమ పిక్స్ షేర్ చేసుకుంటూ… నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు.. నువ్వు నా తారా లోకం అంటూ మిసెస్ అండ్ మిస్టర్ సిద్దు అని అదితి రావు ఇన్ స్టా లో పోస్ట్ పెట్టగా, ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.
అయితే అదితి తన సినీ ప్రస్థానాన్ని 2006లో మలయాళ చిత్రం “ప్రజాపతి”తో ప్రారంభించింది. ఇందులో ఆమె మమ్ముట్టి సరసన నటించింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది. ఆమె తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. హిందీలో “దిల్లీ 6”, “రాక్‌స్టార్”, “పద్మావత్” వంటి చిత్రాల్లో నటించగా, తెలుగులో “సమ్మోహనం”, “మహాసముద్రం” వంటి సినిమాల్లో నటించి అలరించింది. అదితిలో మంచి టాలెంట్ ఉన్నా కూడా ఆమెకి పెద్ద హిట్స్ పడలేదు. ఆమెకి భరతనాట్యం కూడా వచ్చు. చాలా బాగా చేస్తుంది. అయితే హీరమండి సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అదితి.
హీరామండి తర్వాత తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.. నా నటనకు , డాన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన అవకాశాలు రాకపోవడం బాధ అనిపించింది. అయితే సినిమాలు లేక ఖాళీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది. ఇక అదితి ఆమె 1978 అక్టోబర్ 28న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తల్లి విద్యా రావు, ఒక ప్రముఖ శాస్త్రీయ గాయని, తండ్రి ఎహ్సాన్ హైదరి. అదితి రాజకీయంగా ప్రముఖమైన కుటుంబాల నుండి వచ్చింది.