Adipurush Movie | ప్రస్తుతం ఏ సినీ అభిమానిని కదిలించిన ఆదిపురుష్ నామమే జపం చేస్తున్నారు. సమ్మర్ సీజన్లో వెల వెలబోయిన థియేటర్లు ఆదిపురుష్ సినిమాతో కలకలలాడుతున్నాయి. రామయాణ గాథను ౩డీలో చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. రిలీజ్ కు ముందు విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై తిరుగులేని హైప్ క్రియేట్ చేశాయి. దానికి తగ్గట్టే తొలిరోజే ఆదిపురుష్ కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆదినుంచి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇక టీజర్‌తో ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
రాముడు తొలు వస్త్రాలు ధరించాడని, సైఫ్ అలీఖాన్‌కు స్పైక్ పెట్టారని.. అసులు తీస్తుంది రామాయణమేనా అని చాలా మంది విమర్శించారు. కొందరైతే ఏకంగా సినిమాను నిలిపివేయాలని కోర్టుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం అంతా సద్దుమనిగి నేడు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. అంతా సవ్యంగానే జరుగుతుందనుకున్న సమయంలో తాజాగా ఆదిపురుష్ సినిమాపై మరో వివాదం తలెత్తింది. నేపాల్ సెన్సార్ బోర్డు ఈ సినిమాపై అభ్యంతరం తెలిపింది.
సీతా దేవిని భారత్‌లో జన్మించినట్లు చూపడంపై అభ్యంతరం తెలిపింది. సీత నేపాల్‌లో జన్మించారని, దీనిని సవరించకుంటే విడుదలకు అనుమతివ్వమని స్పష్టం చేసింది. అంతేకాకుండా సీత భారతదేశంలో జన్మించిందన్న డైలాగ్ తీసేయకుంటే భారత సినిమాలు ఇక్కడ నిలిపివేస్తామని పలువురు నేతలు మండిపడ్డారు. దీంతో చిత్రబృందం ఆ డైలాగ్‌ను తీసేసి లైన్ క్లియర్ చేసుకుంది. అయితే మార్నింగ్ షోలు మాత్రం నిలిపివేసినట్లు తెలుస్తుంది.