Adipurush Movie Teaser | ప్రభాస్ లైనప్‌లో ముందుగా వచ్చేది ‘ఆదిపురుష్’ సినిమానే. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా రావాల్సి ఉంది. కానీ టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో వీఎఫ్ఎక్స్ కోసం మరో ఆరు నెలలు సినిమాను పోస్ట్ పోన్ చేశారు. దాదాపు రూ.100 నుంచి రూ.150 కోట్ల ఖర్చుతో మళ్లీ వీఎఫ్ఎక్స్ను మెరుగుపరుస్తున్నారు. ఇక మరో రెండు నెలల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు ఆ డేట్‌కు రిలీజవుతుందా అనే అనుమానాలు కూడా నిన్న, మొన్నటి వరకు ఉండేది. కానీ తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితం అవుతుందని చెప్పి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా టీజర్ అప్డేట్ వెర్షన్‌ను రిలీజ్ చేశారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్‌కు విమర్శలు రాగా తాజాగా పలు మార్పులు చేసి టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన అప్డేట్ వెర్షన్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ కాస్త నేచురల్‌గా అనిపిస్తున్నాయి. కలర్ గ్రేడింగ్‌లో కూడా చాలా వరకు మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు టీజర్ తెగ నచ్చేసింది. థాంక్యూ ఓం రౌత్ టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా కూడా ఇలానే ఉంటే రికార్డులు ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు తన్హాజీ ఫేం ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
#Adipurush updated teaser 👌👍#Prabhas #AdipurushAagamanampic.twitter.com/FXONcxeif5
— Suresh Kondi (@SureshKondi_) April 20, 2023