Adipurush Movie Trailer | మరో రెండు నెలల్లో ఆదిపురుష్ రిలీజ్ కానుంది. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఆది నుంచే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వీఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. గతేడాది రిలీజైన టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో ఏకంగా ఆరునెలలు సినిమాను పోస్ట్ పోన్ చేశారు. వీఎఫ్ఎక్స్ను మెరుగు పరచడం కోసం మరో వంద కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల రిలీజైన టీజర్ కాస్త బెటర్‌గానే అనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్ నిడివి 3 నిమిషాల 22 సెకండ్లుగా ఉండనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ట్రైలర్‌ను మే 3న లేదా మే 17న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రభాస్ ఫ్యాన్సే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా ట్రైలర్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక నిన్న, మొన్నటి వరకు కూడా ఈ సినిమా రిలీజ్‌పై ఎన్నో సందేహాలు ఉండేవి. కాగా ఇటీవలే చిత్రబృందం న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్లో ఆదిపురుష్ సినిమా జూన్ 13న ప్రదర్శితమవుతుందని తెలిపడంతో ఈ మూవీ జూన్ 16న కచ్చితంగా వస్తుందన్న క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.