Adipurush Movie | ప్రభాస్ ప్రస్తుతం ఓ భారీ కమర్షియల్ హిట్టు కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన ‘రాధేశ్యామ్’ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఆశలన్ని ‘ఆదిపురుష్’ పైనే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇటీవలే రిలీజైన టీజర్‌కు మాత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. VFXపై తీవ్రంగా విమర్షలు వ్యక్తం అయ్యాయి. వీఎఫ్ఎక్స్ సరిగా లేవని, దీనికంటే వీడియో గేమ్ వీఎఫ్ఎక్స్ బాగుందని పలువురు కామెంట్స్ చేశారు. దాంతో చిత్రబృందం మరోసారి వీఎఫ్ఎక్స్ని మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో ఆదిపురుష్ చిత్రాన్ని ముందుగా ప్రకటించిన తేది నుండి పోస్ట్ పోన్ చేశారు. కాగా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించి జూన్ 16కు వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మరో ఆరు నెలలు పోస్ట్ పోన్ చేసి 2024 ప్రథమార్థంలో రిలీజ్ చేయాలిన అనుకుంటున్నారట. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ను పూర్తిగా మార్చాలని డిసైడ్ అయ్యారట. దాని కోసం సంవత్సరం టైమ్ పడుతుందట. ఈ క్రమంలోనే ఆదిపురుష్ చిత్రాన్ని 2024కు పోస్ట్ పోన్ చేయాలని ఆలోచిస్తున్నారట. అయితే దీనిపై పలువురు మాత్రం ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. ఆల్రేడీ చిత్రబృందం వీఎఫ్ఎక్స్ బాధ్యతలు వేరే కంపెనీకి అప్పగించినట్లు తెలుపుతున్నారు. మరీ ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.