Adipurush Movie collections | ఆర్నెళ్ల కిందట ఒక్క టీజర్‌తో ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయిన ఆదిపురుష్ సినిమా.. ట్రైలర్‌తో అదే ట్రోలర్ బాబులతో చప్పట్లు కొట్టించుకుంది. ట్రైలర్ సహా రెండు పాటలు కూడా జనాల్లోకి పిచ్చ పిచ్చగా నచ్చేశాయి. ఇంకేముంది నెగెటివిటీ అనే పదమే గత నెల రోజులుగా వినిపించలేదు. ఇక దానికి తగ్గట్లే ప్రీ రిలీజ్ వేడుక అంగ రంగ వైభవంగా జరుపడంతో రిలీజ్‌కు ముందు సినిమాపై తిరుగులేని హైప్ ఏర్పడింది. టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక శుక్రవారం భారీ ఎత్తున రిలీజైన ఈ సినిమా తొలిరోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓ రౌత్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు ఇది రామాయణమే కాదు. రామయణం కథను తప్పుగా చూపించాడంటూ తెగ ఆడుకుంటున్నారు.
ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సినిమా తొలిరోజునే రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఆదిపురుష్ సినిమా మొదటి రోజు అక్షరాల రూ.130 కోట్ల కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది. అది కూడా డిజాస్టర్ టాక్‌తో. రెండో రోజు కూడా బుకింగ్స్ భారీ రేంజ్‌లోనే ఉన్నాయి. సినిమాకు ఎంత నెగెటివిటీ వచ్చినా ప్రేక్షకులు మాత్రం ఈ ఎపిక్ సాగాను త్రీడీలో చూసేందుకు ముచ్చటపడతున్నారు. ఇక ఆదిపురుష్ ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేదించడం పెద్ద కష్టమేమి కాదు. అయితే ఫస్ట్ వీకెండ్ వరకూ వద్దన్నా ఈ సినిమాకు జోరుగా కలెక్షన్లు వస్తాయి. అయితే సోమవారం కలెక్షన్లు బట్టే ఈ సినిమా ఫలితం తేలుతుంది. ఇక ప్రభాస్‌కు రిలీజ్ రోజున వంద కోట్లు సాధించిన సినిమాల్లో ఇది మూడవది. దీనికంటే ముందు బాహుబలి-2, సాహో సినిమాలు ఆ లిస్ట్‌లో ఉన్నాయి. ఇక ఇండియాలో మూడు సార్లు తొలిరోజు వంద కోట్లు సాధించిన హీరోగా ప్రభాస్ నిలిచాడు.
రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీతగా కనిపించింది. లంకాధిపతి రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించాడు. రెట్రో ఫైల్స్, టి సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా తెలుగులో రూ.120 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగింది. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమాకు రూ.33 కోట్ల వరకు షేరును సాధించింది.