Adipurush Movie | ప్రస్తుతం సినీ లవర్స్ దృష్టంతా ఆదిపురుష్ సినిమాపైనే ఉన్నాయి. గత నెలన్నర రోజులుగా ఆహా ఓహో అనిపించే సినిమా ఒక్కటి కూడా టాలీవుడ్లో రిలీజ్ కాలేదు. దాంతో ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమాపైనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని ఈ సినిమాపై ట్రైలర్ సహా రెండు పాటలు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాయి. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. గతేడాది చివర్లో విడుదలైన టీజర్ ఓ రేంజ్లో ట్రోల్స్‌కు గురైంది. దాంతో చిత్రయూనిట్ దెబ్బకు ఆరు నెలలు షూటింగ్‌ను వాయిదా వేసి మెరుగైన వీఎఫ్ఎక్స్ను తీర్చిదిద్దడంలో మునిగిపోయింది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో వచ్చిన నెగిటివిటీ అంతా ట్రైలర్‌తో పటా పంచలయింది. ఇటీవలే రిలీజైన ఫైనల్ ట్రైలర్ కు కూడా విశేష స్పందన వచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ సర్టిఫికేట్ ను జారీ చేసింది. 2గంటల 59 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ రన్ టైమ్ తో ఏ సినిమా రాలేదు. కంటెంట్ కొత్తగా ఉన్న ఎంటర్టైనమెంట్ చేసేలా లేకపోతే రెండు గంటలు కూడా ప్రేక్షకులు తెగ బోరింగ్ గా ఫీలవుతుంటారు. అలాంటిది దాదాపుగా మూడు గంటల రన్ టైమ్ తో రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ సినిమా అడుగుడున ఆసక్తి రేకెత్తించేలానే ఉండాలి. పైగా మనం ఎన్నో వందల సార్లు విన్న, చూసిన కథ ఇది. కాగా ఎంతో ఆకట్టుకునేలా ఉంటేనే ఈ సినిమాను జనాలు మూడు గంటలు చూడగలరు. కొంచెం తేడా కొట్టినా చిత్రబృందం ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకాధిపతి రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తుంది.