Adipurush | రాముడిలా కాదు.. కర్ణుడిలా ఉన్నాడు!.. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ లుక్‌పై సీనియర్ నటి సంచలన కామెంట్స్..
Adipurush | యంగ్ రెబల్ స్టార్ నటించిన కొత్త చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.
Adipurush | యంగ్ రెబల్ స్టార్ నటించిన కొత్త చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనున్నది. రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ను పలువురు ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి కస్తూరి సైతం ‘ఆది పురుష్’ చిత్రంలో ప్రభాస్ లుక్‌పై సంచలన కామెంట్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ఏ సంప్రదాయంలో శ్రీరామలక్ష్మణులకు మీసాలు, గడ్డలు చూపించారు..? ఎందుకు రామలక్ష్మణులను ఇలా చూపిస్తున్నారు’ ? అంటూ ప్రశ్నించింది.
ప్రభాస్ సొంత ఇండస్ట్రీ అయిన తెలుగులో ఎందరో గొప్ప లెజెండ్స్ శ్రీరాముడి పాత్రలను చక్కగా పోషించారని.. కానీ ప్రస్తుతం ప్రభాస్‌ని చూస్తుంటే తనకు రాముడు గుర్తుకు రావడం లేదని, కర్ణుడు గుర్తుకు వస్తున్నాడంటూ ట్వీట్ చేశారు. అయితే, కస్తూరి ట్వీట్‌పై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి తరానికి రాముడి కథను తెలిపేందుకు ప్రభాస్ ప్రయత్నిస్తుంటే విమర్శిస్తారా? అంటూ మండిపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

