Adipurush Movie | ఏ ముహూర్తానా ‘అదిపురుష్’ టీజర్ రిలీజ్ చేసారో కానీ, అప్పటి నుండి సినిమాపై వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. గతేడాది దసరా కానుకగా రిలీజైన టీజర్‌పై ప్రేక్షకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రాముడు, హనుమంతుడు తోలుతో చేసిన దుస్తులు ధరించారని, రావణుడిని చూపించిన విధానం సరిగా లేదని పలు విధాలుగా విమర్శలు చేశారు. అంతేకాకుండా సినిమా విడుదలపై స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు దాఖలైంది. ఇన్నీ విమర్శల మధ్య ఆది పురుష్ బృందం వెనక్కు తగ్గి వీఎఫ్ఎక్స్ను మెరుగు పరచడం కోసం సినిమాను ఏకంగా ఆరు నెలలు సినిమాను పోస్ట్ పోన్ చేశారు.
ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటున్న ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఆ పోస్టర్ హిందూ మత ఆచారాలకు విరుద్ధంగా ఉందని ముంబైకి చెందిన ఓ వ్యక్తి సాకినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కూడా నమోదైంది. శ్రీరాముడు హిందూ గ్రంధంలో పేర్కొన్న రామచరితమానస్ యొక్క సహజ స్ఫూర్తికి మరియు స్వభావానికి విరుద్ధమైన వేషంలో ఉన్నాడుని, ఆదిపురుష్ రామాయణంలోని అన్ని పాత్రలు జంధ్యం లేకుండా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇలా ఆది నుండి ఆదిపురుష్ సినిమాకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. అన్ని సవ్యంగా జరిగితే ఆదిపురుష్ సినిమా రిలీజై ఇప్పటికే ముడు నెలలు అయ్యుండేది. టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో మేకర్స్ వీఎఫ్ఎక్స్ కోసం మరో వంద కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను జూన్ 16న ఇండియాతో పాటు పలు దేశాల్లో విడుదల కానుంది.