తెలుగుదనం నిండుగా కనిపించే అదా శర్మ ‘కేరళ ఫైల్స్’తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. చూడటానికి కాస్త సిగ్గరిగా కనిపించే ఈ సొట్ట బుగ్గల సుందరి భోజనం విషయంలో తనకు మొహమాటమే తెలియదని చెబుతున్నది. పరిమితంగానే అయినా నచ్చినవన్నీ భేషుగ్గా లాగించేస్తానని అంటున్నది. తన ఆహార నియమాలు, ఇష్టాయిష్టాల గురించి అదా శర్మ పంచుకున్న కబుర్లు..
ఉదయం కడుపు ఖాళీగా ఉంటే నాకు ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడే నా మెదడు చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే, లేవగానే ఒక లీటర్ నీళ్లు తాగుతా! బ్రేక్‌ఫాస్ట్ అలవాటు లేదు. డైరెక్ట్‌గా లంచ్ చేస్తా! నేను వీగన్ డైట్ ఫాలో అవుతా. దక్షిణాది వంటకాలంటే చాలా ఇష్టం.
డైట్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. రోజూ రెండు పూటలా అన్నం తినాల్సిందే! అయితే బ్రౌన్ రైస్ తీసుకుంటా. లంచ్లోకే దోశ, ఇడ్లీ కూడా టేస్ట్ చేస్తా. బ్రౌన్ పోహా కూడా ఇష్టంగా తింటా. కార్బొహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటా. ఫైబర్ ఉండి తీరాల్సిందే. అప్పుడప్పుడు సాయంత్రాలు చాట్ ఎంజాయ్ చేస్తా. రాత్రి డిన్నర్లో ఒక కప్పు రైస్ కానీ, కిచిడీ కానీ తింటా.
‘మీకు ఇష్టమైన పదార్థాలు ఏంటి?’ అని అడిగితే చాంతాడంత లిస్ట్ ఏకరవు పెట్టాల్సి వస్తుంది. రుచిగా ఉన్నది ఏదైనా తినేస్తా. స్వీట్లు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చాక్లెట్ ఫ్లేవర్ స్వీట్లంటే ప్రాణం. మా బామ్మ ద బెస్ట్ కుక్ ఇన్ ద వరల్డ్. ప్రతి ఆదివారం ఆమె పది రకాల వెరైటీలతో మీల్స్ సిద్ధం చేస్తుంది. ప్రతి
పదార్థం అమృతమే! తనను చూసేందుకు తరచూ వెళ్తుంటా.
తినడంలోనే కాదు వండటంలోనూ నాకు మంచి పేరు ఉంది. పొగలు విరజిమ్మే సిజ్లర్స్ చేయడంలో నాది అందెవేసిన చేయి అంటే నమ్మండి.