ఇటీవల ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న నటి అదాశర్మ. ఆమె తాజాగా నటిస్తున్న చిత్రం ‘సీడీ క్రిమినల్ అండ్ డెవిల్’. కృష్ణ అన్నం దర్శకుడు. ఎస్ఎస్సీఎమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ ‘సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా ఓ సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది.
చిత్రం చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా వుంటుంది’ అన్నారు. విశ్వంత్, జబర్థస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్.ఆర్.ధృవన్.