Vidya Balan | బాలీవుడ్ నటి విద్యాబాలన్ కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అదృష్టవశాత్తు తను కాస్టింగ్ కౌచ్ ఉబిలో చిక్కుకోలేదని తెలిపింది. ఒక యాడ్ షూట్ కోసం చెన్నై వెళ్లినప్పుడు ఓ దర్శకుడు తనతో అభ్యంతకరంగా ప్రవర్తించాలనుకున్నట్లు విద్యాబాలన్ చెప్పింది. సినిమా గురించి చర్చించడానికి ఆ దర్శకుడితో ఓ కాఫీ షాప్‌కు వెళ్లానని, కథ గురించి మాట్లాడుతున్న సమయంలో మిగితా విషయాలు రూమ్‌లో మాట్లాడుకుందాం అని ఆ దర్శకుడు అన్నట్లు తెలిపింది. అయితే తను భయపడుతూనే రూమ్‌కు వెళ్లానని, గదిలోకి వెళ్లాక తెలివిగా వ్యవహరించి డోర్‌ను తెరిచుంచానని, దాంతో ఆ దర్శకుడు ఏమి మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది.
అయితే ఆ సమయంలో తనకు ఎవరూ సలహాలు ఇవ్వలేదని, సమయస్పూర్తితో తనను తాను రక్షించుకున్నాని తెలిపింది. బెంగాళి సినిమాలతో కెరీర్ ప్రారంభించిన విద్యాబాలన్.. పరినీత సినిమాతో హిందీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసినిమానే తిరగులేని విజయాన్ని సాధించింది. అయితే సిల్క్‌స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ది డర్టీ పిక్చర్ విద్యాబాలన్‌కు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస బాలీవుడ్ సినిమాలతో దూసకుపోయింది. ఇక తెలుగులోనూ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు చేసింది. అయితే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో మళ్లీ విద్యాబాలన్ తెలుగులో మరో సినిమా చేయలేదు.