‘బేఫికర్’, ‘వార్’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో స్టార్డమ్ పొందిన నాయిక వాణీ కపూర్. ఈ తార నటననే కాదు డ్యాన్సులనూ బాగా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. ఇలా పాటల్లో డ్యాన్సులతో అలరించడం భారతీయ నటీనటులకు మాత్రమే సాధ్యమని అంటున్నదీ భామ. నటిగా తనను తాను ఈ పాటల ద్వారానే వ్యక్తీకరించుకుంటానని చెబుతున్నదామె. వాణీ కపూర్ మాట్లాడు తూ…‘హాలీవుడ్ నటీనటులు కేవలం సీన్స్‌లో పర్ఫార్మ్ చేస్తా రు.
వాళ్లకు పాటలు, వాటిలో డ్యాన్సులు ఉండవు. పాటలు, నృత్యాలు ప్రేక్షకులకు మన సినిమాను మరింత దగ్గర చేశాయి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు నేను డ్యాన్సుల్లో శిక్షణ తీసుకోలేదు. గంటల తరబడి సాధన చేసి సింగిల్ టేక్‌లో స్టెప్స్ చేసే సామర్థ్యం తెచ్చుకున్నాను. నా కెరీర్లో ‘గుంగ్రూ..’, ‘నషే సి చాంద్ గయీ..’ ‘ఉడే దిల్ బేఫికర్..’ వంటి పాటలు బహుళ జనాదరణ పొందాయి. నటిగా నన్ను నేను ఈ పాటల ద్వారానే వ్యక్తీకరించుకుంటాను. నటిగా అదే నా ప్రత్యేకత అనుకుంటా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ తార సినిమాలతో పాటు ఓటీటీల్లో ఆసక్తికర పాత్రల్లో నటిస్తున్నది.