టాలీవుడ్లోనే కాదు, అన్ని భాషల్లోనూ ఐటెంసాంగ్స్కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఊర్వశి రౌథేలా. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు ఎక్కడలేని కష్టం వచ్చిపడింది. వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండో పాక్ మ్యాచ్ చూడ్డానికి ఈ అందాల భామ స్టేడియంకి వెళ్లింది. అక్కడ ఆనందంతో గంతులేసిందేమోగానీ.. ఆ హడావిడిలో బంగారంలాంటి సెల్‌ఫోన్ జారిపోయింది. ఇంటికొచ్చి చూసుకుంటే ఫోన్ లేదు.
ఇక ఊర్వశి బాధ దేవుడికే ఎరుక. పాటకు లక్షల్లో పారితోషికాలు తీసుకునే ఈ బ్యూటీ, ఆఫ్టరాల్ ఓ సెల్ కోసం ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటి? అనుకుంటున్నారా? సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎక్కువశాతం ఐఫోన్లనే వాడతారు. ఉర్వశిది కూడా ఐఫోనే. కాకపోతే, ఇది సాదాసీదా ఐఫోన్ కాదు, స్వచ్ఛమైన బంగారం ఫ్రేమ్‌తో చేసిన ఐఫోన్. చాలా తక్కువ సంఖ్యలో తయారయ్యే లిమిటెడ్ వెర్షన్ అది. దాంతో ఫోన్ దొరికితే వెంటనే సంప్రదించాలంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు కూడా చేస్తున్నది. ఆమె పోస్టులు చూసిన నెటిజన్స్ సరదాగా స్పందిస్తున్నారు. ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఏమైనా ఉన్నాయా? అంటూ సైటైర్లు వేస్తున్నారు.