Sreeleela | తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతనికి ఉండాల్సిన క్వాలిటీలు ఏంటి? తదితర అంశాలను సరదాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది అందాలభామ శ్రీలీల. ‘ నన్ను చేసుకోబోయేవాడికి ముచ్చటగా మూడు లక్షణాలుండాలి. అవి కూడా చాలా సింపుల్ లక్షణాలు. అందులో మొదటిదేంటంటే.. కొన్ని విషయాల్లో నన్ను భరించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించాలి.. భరించాలి. రెండు.. అతనికి చక్కని హాస్య చతురత ఉండాలి. సెన్సాఫ్హ్యూమర్తో నవ్వించేవాడైవుండాలి. మూడు.. కాస్త ఫ్యామిలీ టైప్గా పద్దతిగా అందంగా ఉండాలి. అంతే సింపుల్.. ఈ మూడు గుణాలు ఉంటే చాలు.’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. అలాంటివాడు ఎవరైనా తారసపడ్డాడా? అని అడిగితే ‘లేదు.. ఒక వేళ కనిపించినా కాన్సన్ట్రేట్ చేసేంత టైమ్ నాకులేదు. నేను బిజీ..’ అంటూ తనదైన శైలిలో చెప్పింది శ్రీలీల.